schedule Tuesday, September 08, 2026

విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు

calendar_today July 10, 2022
person dharshininews
విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు
విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు - భారీ వ‌ర్షాల కార‌ణంగా సీఎం కేసీఆర్ నిర్ణ‌యం హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ముఖ్యమంత్రి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.