schedule Friday, September 04, 2026

ఉప్పొంగుతున్న‌ కాగ్నా

calendar_today August 30, 2021
person dharshininews
ఉప్పొంగుతున్న‌ కాగ్నా
ఉప్పొంగుతున్న‌ కాగ్నా - భారీగా వ‌రధ ఉధృతి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు కాగ్నాన‌ది ఉప్పొంగుతోంది. గ‌త రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో న‌దిలోకి భారీగా వ‌ర‌ధ నీరు చేరుతుంది. దీంతో నీటి మ‌ట్టం పెరిగి.. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. కాగ్న న‌దిపై ఉన్న పురాతన వంతెన‌ను ఆనుకుని వ‌ర‌ధనీరు ప్ర‌వ‌హిస్తోంది. క్ర‌మంగా ఈ నీటి ప్ర‌వ‌హాం ఇంకా పెరిగే అవ‌కాశం ఉండ‌గా గ‌తంలో పాత వంతెన‌కు చేసిన మ‌ర‌మ్మ‌త్తులకు మ‌ళ్లీ ప్ర‌మాదం ఏర్పడే వీలు కూడ ఉందని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర‌ధ నీటి ప్ర‌వాహాంతో కాగ్నా నది ఉధృతి రూపం దాల్చింది. న‌దిలోకి నీరు రావ‌డంతో తిల‌కించేందుకు ప‌ట్ట‌ణ వాసులు కాగ్న కొత్త వంతెన‌కు చేరుకుంటున్నారు.