schedule Monday, September 14, 2026

ఖర్చు లేకుండా కంటి పరీక్షలు

calendar_today August 18, 2022
person dharshininews
ఖర్చు లేకుండా కంటి పరీక్షలు
ఖర్చు లేకుండా కంటి పరీక్షలు - లయన్స్ క్లబ్ సేవా దృక్పథం - 16 మందికి ఉచిత సేవలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పేదలకు ఖర్చులేకుండా కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లతో తాండూరు లయన్స్ సేవా దృక్పథాన్ని కొనసాగిస్తోంది. గురువారం లయన్స్ క్లబ్ తాండూరు అధ్యక్షులు జహీర్ అహమ్మద్, కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సాధూరాం కింటి ఆసుపత్రి వైద్యుల సహాకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన వైద్య శిబిరంలో 16 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. గతంలో నిర్వహించిన శిబిరంలో కొంతమందికి, తాజాగా మరికొంత మందికి ఆపరేషన్లు అవసరం అన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు జహీర్ అహమ్మద్, రొంపల్లి సంతోష్ కుమార్ లు మాట్లాడుతూ పేదల కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా 13 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు చెప్పడంతో వారిని క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు తరలించడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ పూర్తయిన తరువాత కూడ వారికి లయన్స్ క్లబ్ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. కంటి సమస్యలు ఉన్న పేదవారు లయన్స్ క్లబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి యూసుఫ్, సీనియర్ సభ్యులు సల్లా దామోదర్, ఓం ప్రకాష్ సోమాని, రామానుజ సోని, జయశ్రీ దివాడే. వీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.