schedule Saturday, July 04, 2026

స‌మాజ నిర్మాత‌లు ఉపాధ్యాయులు

calendar_today September 5, 2022
person dharshininews
స‌మాజ నిర్మాత‌లు ఉపాధ్యాయులు
స‌మాజ నిర్మాత‌లు ఉపాధ్యాయులు - ఎస్ఎస్ఎంవీ, ఆపిల్ కిడ్స్‌లో ఘ‌నంగా టీచ‌ర్స్ డే - స‌ర్వేప‌ల్లికి నివాళులు, ఉపాధ్యాయుల‌కు స‌న్మానం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉపాధ్యాయులు స‌మాజ నిర్మాత‌లు అని తాండూరు శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల క‌ర‌స్పాండెంట్ పెరుమాళ్ల వెంక‌ట్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయా పాఠ‌శాల‌లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. క‌ర‌స్పాండెంట్ పెరుమాళ్ల వెంక‌ట్ రెడ్డితో పాటు టీచ‌ర్లు, విద్యార్థులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంత‌రం పాఠశాలలోని ఉపాధ్యాయులకు కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు కూడ‌ ఉపాధ్యాయులను సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ పి.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల దేవుళ్లతో సమానం అన్నారు. సమ స‌మాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీల‌క‌మ‌న్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. పుస్తకంలోని పాఠ్యాంశాలతో జీవిత పాఠాలను నేర్పించాలని సూచించారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను తల్లిదండ్రుల భావిస్తూ క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.