schedule Tuesday, September 08, 2026

పేదల జీవితాలకు కొండంత ఆసరా

calendar_today September 12, 2022
person dharshininews
పేదల జీవితాలకు కొండంత ఆసరా
పేదల జీవితాలకు కొండంత ఆసరా - వైస్ చైర్ పర్సన్ ప‌ట్లోళ్ల‌ దీపా నర్సింలు - 9వ వార్డులో ఆసరా గుర్తింపు కార్డుల పంపిణీ తాండూరు, దర్శి నిప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి ఆసరా ఫించన్ అందిస్తూ అండగా నిలుస్తోందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. సోమవారం తన వార్డు సాయిపూర్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వై స్ చైర్ పర్సన్ దీపా నర్సింలు హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య ఫించన్ వయస్సును 57 ఏండ్లకు తగ్గించి ఆసరా అందిస్తుందన్నారు. ప్రభుత్వం ముంజూరు చేస్తున్న ఫించన్ వృద్ధులకు, పేదల జీవితాలకు భరోసా అందిస్తుందన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అందరు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.