schedule Tuesday, September 08, 2026

నులి పురుగుల నివారణతోనే పిల్లల ఆరోగ్యం

calendar_today September 15, 2022
person dharshininews
నులి పురుగుల నివారణతోనే పిల్లల ఆరోగ్యం
నులి పురుగుల నివారణతోనే పిల్లల ఆరోగ్యం - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ - చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి: నులి పురుగులను నివారించడం ద్వారానే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తన వార్డు 25లో ఉన్న అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులి పురుగుల వల్ల పిల్లల్లో పోషకార లోపం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయన్నారు. శారీరక, మానసిక అభివృద్ధిలో మందకోడిగా ఉంటారన్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు 2 ఏండ్లు పైబడిన పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలన్నారు. నులి పురుగుల నివారణతోనే ఆరోగ్యవంతంగా పిల్లలు ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, అంగన్ వాడి టీచర్లు, ఆశ వర్కర్లు. తదితదితరులు పాల్గొన్నారు.