schedule Friday, July 10, 2026

చిన్నారులకు నులిపురుగుల మాత్రలు వేయించాలి

calendar_today September 15, 2022
person dharshininews
చిన్నారులకు నులిపురుగుల మాత్రలు వేయించాలి
చిన్నారులకు నులిపురుగుల మాత్రలు వేయించాలి - తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - పాఠశాలలో పిల్లలకు అల్బేండజోల్ మాత్రల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి: చిన్నారులకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలను వేయించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పరిధి పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అల్బేండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లలకు నులిపురుగుల మాత్రలను వేయడం వల్ల వారిలో ప్రాథమిక దశలోనే నివారించవచ్చారు. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇందుకోసం పిల్లల తల్లిదండ్రులు వారికి నులి పురుగుల మాత్రలను వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ భాస్కర్, వైద్యులు, టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.