schedule Sunday, July 05, 2026

పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్

calendar_today October 1, 2022
person dharshininews
పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్ - అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు - అంతారంలో కొత్త పెన్షన్ దారులకు కార్డులు పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అడిగిన అడగకపోయినా అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేదల పాలిట దేవుడు గా మారారని తాండూర్ మండలం అంతారం గ్రామ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ శాంతులు అన్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా లబ్ధిదారులకు పింఛన్ కార్డులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. 57 ఏండ్ల వృద్దులకు ఆసరా అందజేస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. సంక్షేమంలో దేశంలో ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.