schedule Thursday, September 17, 2026

అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

calendar_today October 15, 2022
person dharshininews
అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి - పరామర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. యాలాల మండలం జుంటుపల్లిలో పలువురు అతిసారకు గురై తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఆరోగ్యంగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, వైద్యులు తదితరులు ఉన్నారు.