గణనాథుడికి ప్రత్యేక పూజలు
September 17, 2026
dharshininews
గణనాథుడికి ప్రత్యేక పూజలు
- పూజలు నిర్వహించిన మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్
- పాల్గొన్న వ్యాపారులు, నేతలు, భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గాంధీచౌక్ గణనాథుడు విశేష పూజలందుకున్నాడు.
వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం మాజీ కౌన్సిలర్ మంకాల్ రాఘవేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాథుడికి పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు పుష్కలంగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించాలని గణేశుడిని వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి స్థానిక వ్యాపారులు, నేతలు, భక్తులు పాల్గొని గణనాథున్ని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వాహకులు భక్తులకు ప్రసాదం అందజేశారు.ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సంతోష్‌గౌడ్, కరుణాకర్, రుద్రు పాటిల్, కిరాణా అసోసియేషన్ కార్యదర్శి కోట్రిక నాగరాజ్, కోట్రిక శ్రీకాంత్, మంకాల్ వెంకటేశం, ముద్దెల్లి ప్రదీప్, సాయిరెడ్డి, మొద్దెల్లి సునీల్, తర్లపల్లి హరి తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44747/