ఫామ్‌ఆయిల్‌కు ధర.. ఉల్లిగడ్డకు సబ్సిడీ..!
September 16, 2026
dharshininews
ఫామ్‌ఆయిల్‌కు ధర.. ఉల్లిగడ్డకు సబ్సిడీ..!
- రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- అసెంబ్లీ సమావేశంలో తాండూరు సమస్యలపై గళం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు పండిస్తున్న ఫామ్ అయిల్, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర, సబ్సీడీలు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (బీఎంఆర్) కోరారు.
బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో ఫాంఆయిల్, ఉల్లిగడ్డ సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఫాంఆయిల్ సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు. ఫామ్ఆయిల్ పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పంట సాగు చేసిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. ఫామ్‌అయిల్ చెట్లు పెరిగిన అనంతరం వాటిపై నుంచి 11 కేవీ, ఎల్‌టీ విద్యుత్ లైన్లు వెళ్లే ప్రాంతాల్లో లైన్ షిఫ్టింగ్ అవసరమవుతోందని తెలిపారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో రైతులు ఉల్లిగడ్డ సాగు చేస్తున్నారని బీఎంఆర్ తెలిపారు.
ఉల్లిగడ్డ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్సిడీ అందించి వారిని ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రిని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
https://www.dharshininews.com/44728/