schedule Wednesday, September 16, 2026

వైభవంగా హిందూ ఉత్సవ సమితి శోభాయాత్ర..!

calendar_today September 16, 2026
person dharshininews
వైభవంగా హిందూ ఉత్సవ సమితి శోభాయాత్ర..!
వైభవంగా హిందూ ఉత్సవ సమితి శోభాయాత్ర..! - ఎడ్ల బండిలో నిమజ్జనానికి తరలిన మట్టి వినాయకుడు - భజన కీర్తనలతో పురవీధుల్లో ఊరేగింపు - గణేషుని లడ్డు సొంతం చేసుకున్న గురురాజ్ జోషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితి వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మొట్ట మొదటి సారి వినాయకున్ని ప్రతిష్టించి ముందు పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడో రోజు బుధవారం సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని నిమజ్జనానికి తరలించారు. అంతకుముందు విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని కార్యాలయంలో ప్రతిష్టించిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎడ్ల బండిపై మట్టి గణపయ్యను నిమజ్జనంకు తరలించారు. భజన కీర్తనలతో వినాయక శోభాయాత్ర ముందుకు కదిలింది. పుర వీధుల్లో వినాయకున్ని ఊరేగిస్తూ కోకట్ కాగ్నానదికి తరలించారు. మరోవైపు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని లడ్డూను కాంగ్రెస్ సీనీయర్ నేత గురురాజ్ జోషి దక్కించుకున్నారు. శోభాయాత్రలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సమితి గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, కోశాధికారి అంతారం కిరణ్, సభ్యులు పర్యాద రామకృష్ణ, దేవగారి రమేష్‌, యువకులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44720/