schedule Thursday, September 17, 2026

హిందూ ఉత్సవ సమితికి చీఫ్‌ విప్ విరాళం..!

calendar_today September 17, 2026
person dharshininews
హిందూ ఉత్సవ సమితికి చీఫ్‌ విప్ విరాళం..!
హిందూ ఉత్సవ సమితికి చీఫ్‌ విప్ విరాళం..! - రూ. 3లక్షల 51వేలు అందించిన మహేందర్ రెడ్డి - కృతజ్ఞతలు తెలిపిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి విరాళం అందజేశారు. ప్రతి యేడాది జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలకు హిందూ ఉత్సవ సమితికి మహేందర్ రెడ్డి భారీ విరాళం అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈయేడాది కూడా ఉత్సవాలు జరుపుకునేందుకు తన వంతుగా రూ. 3లక్షల 51వేల విరాళం అందజేశారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, సభ్యులకు అందజేశారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వినాయకుని కృపా కటాక్షాలు అందరికి సిద్దించాలని వేడుకున్నారు. పూజలు, నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మరోవైపు హిందూ ఉత్సవ సమితికి విరాళం అందజేయడం పట్ల సభ్యులు మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి అంతారం కిరణ్‌, ఉపాధ్యక్షులు అష్టికర్ అశీష్‌, సభ్యులు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/44741/