schedule Thursday, September 17, 2026

అతిసార మృతురాలి కుటుంబానికి అండ

calendar_today October 16, 2022
person dharshininews
అతిసార మృతురాలి కుటుంబానికి అండ
అతిసార మృతురాలి కుటుంబానికి అండ - బీవీజీ ఫౌండేషన్‌ ద్వారా రూ. 5వేల ఆర్థిక సాయం - కుటుంబ సభ్యులకు అందజేసిన డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం జుంటుపల్లిలో అతిసార విజృంభణ గ్రామస్తుల జీవితాలను అల్లకల్లోలం చేసింది. గ్రామానికి చెందిన కాశమ్మ అనే మహిళ కన్నుమూసింది. ఈ విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు, ప్రతినిధులు పరామర్శించారు. ఆదేవిధంగా తాండూరు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ సభ్యులతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు బీవీజీ ఫౌండేషన్ తరుపున డాక్టర్ సంపత్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఆర్ధిక సహాయం అందజేసారు. అనంతరం డాక్టర్ సంపత్ కుమార్ జుంటుపల్లి గ్రామంలో పలువురిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాండూరు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కౌన్సిలర్ అసిఫ్, జుంటుపల్లి గ్రామస్తులు ఉన్నారు.