schedule Thursday, September 17, 2026

ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు

calendar_today September 17, 2026
person dharshininews
ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు - పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి - పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - వేడులకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. విశ్వకర్మ సంఘం, కార్యానిర్వహణ కమిటి ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని కందనెల్లి గుట్ట వద్ద ఉత్సవాలు నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా యజ్ఞం, హోమం కార్యక్రమాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అంతకుముందు భగవాన్‌ విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరై భగవాన్ విశ్వకర్మకు పూజలు నిర్వహించారు. యజ్ఞం, హోమం కార్యక్రమాలలో పాల్గొన్నారు. వారితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, కూడా దర్శించుకుని పూజలు నిర్వహించారు. విశ్వకర్మ జయంతి ఉత్సవాలలో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం గౌరవాధ్యక్షులు కరణం పురుషోత్తం రావు, సభ్యులు గద్దె శ్రీనివాస్ చారి, జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44749/