schedule Friday, July 10, 2026

సైకిల్ యాత్రకు రండి..!

calendar_today October 27, 2022
person dharshininews
సైకిల్ యాత్రకు రండి..!
సైకిల్ యాత్రకు రండి..! - రేపు గౌతాపూర్ నుంచి వికారాబాద్‌ వరకు - జయప్రదం చేయండి : కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: రండి సైకిల్‌ యాత్రం చేద్దాం అంటూ కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసుశాఖ ఆధ్వర్యంలో రేపు సైకిల్‌ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మండలంలోని గౌతపూర్ నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రం వరకు ఈ సైకిల్ యాత్ర ఉంటుందని తెలిపారు. ఈ సైకిల్ యాత్రలో పాల్గొనాలనుకునే వారు సెల్‌: 9440627239కు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సైకిల్ యాత్రలో పెద్దలు, యువకులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞఫ్తి చేశారు.