schedule Thursday, September 17, 2026

గ్రహణం ఎఫెక్ట్..!

calendar_today November 8, 2022
person dharshininews
గ్రహణం ఎఫెక్ట్..!
గ్రహణం ఎఫెక్ట్..! - దేవాలయాల మూత - చంద్రగ్రహణంతో దర్శనాలు రద్దు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో ప్రసిద్ధ దేవాలయాలు మూతపడ్డాయి. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని కాళికా దేవాలయం, భద్రేశ్వర దేవాలయం, స్టేషన్ హనుమాన్ దేవాలయం, సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం, పోట్లీ మహారాజ్ దేవాలయం, నగరేశ్వర దేవాలయం తదితర దేవాలయాలను మూసివేశారు. గ్రహణం సందర్భంగా దేవాలయాల్లో పూజలు, భక్తులకు దర్శనాలను రద్దుచేశారు. అర్జిత సేవలను కూడ నిలిపి వేశారు. మంగళవారం రాత్రి దేవాలయాల సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల తరువాతే దేవాలయాలు తెరవడం జరుగుతుందని ఆయా దేవాలయాల అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి యధావిధిగా దర్శన, అర్జిత, పూజా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు