schedule Saturday, September 05, 2026

బ‌షీరాబాద్ ఉపసర్పంచ్ రాజీనామా

calendar_today September 3, 2021
person dharshininews
బ‌షీరాబాద్ ఉపసర్పంచ్ రాజీనామా
బ‌షీరాబాద్ ఉపసర్పంచ్ రాజీనామా - ఎంపీఓకు లేఖ అందించిన ప‌ర్వీన్‌భేగం తాండూరు, ద‌ర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గం బషీరాబాద్ మండలం కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ పర్వీన్‌భేగం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ఎంపీఓ ర‌మేష్‌కు ఆమె రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె విలేకరలతో మాట్లాడుతూ తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావుల‌కు ఇచ్చిన హామి మేర‌కు తన పదవికి రాజీనామా చేసిన‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా తనను ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్న సమయంలో ఎలాంటి నిబంధనలు పెట్టలేదని, కాని ఇప్పుడు రెండున్నర సంవత్సరాల పదవికాలం ఒప్పందం పేరుతో.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేర‌కు ఇష్ట‌పూర్వ‌కంగా రాజీనామా చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాజురెడ్డి, రాజారత్నం, పవన్ ఠాకూర్, రాము నాయక్, రజాక్, రాజన్న, రియాజ్, నరేష్ చౌహన్, సాయిలు గౌడ్ తదితరులు ఉన్నారు.