schedule Thursday, September 03, 2026

నెల రోజులు గోవాకీ లైగ‌ర్

calendar_today September 4, 2021
person dharshininews
నెల రోజులు గోవాకీ లైగ‌ర్
నెల రోజులు గోవాకీ లైగ‌ర్ - ప్లాన్ చేసిన పూరీ టీం ద‌ర్శిని : అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్, విజ‌య్ దేవ‌రకొండ క‌ల‌యిక‌లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం లైగ‌ర్. ఈ చిత్ర షూటింగ్ కోసం పూరీ బృందం మరోసారి రంగంలోకి దిగుతోంది. నెల‌రోజుల పాటు గోవాలో షూటింగ్‌కు ప్లాన్ చేశారు. వచ్చే వారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణని ఆరంభిస్తారు. ఈ షెడ్యూ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలు స్తోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటుంది. విజయ్ దేవర కొండ కథానాయకుడిగా, బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్ భామ అనన్య పాండే కథానాయిక. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.