schedule Thursday, September 17, 2026

బస్తీ దవాఖానలో అదనపు వైద్య సిబ్బంది కావాలి

calendar_today December 16, 2022
person dharshininews
బస్తీ దవాఖానలో అదనపు వైద్య సిబ్బంది కావాలి
బస్తీ దవాఖానలో అదనపు వైద్య సిబ్బంది కావాలి - జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు కౌన్సిలర్ బొంబీనా వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో అదనపు వైద్య సిబ్బందిని నియమించాలని 14వ వార్డు కౌన్సిలర్ బొంబీనా కోరారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో 60 శాతం మంది నిరుపేదలు జీవిస్తున్నారని, మహిళలకు ఏమైనా సమస్య ఏర్పడితే పట్టణానికి 3,4 కిలో మీటర్ల దూరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో గైనకాలజిస్ట్, పిడియాట్రీషన్, అదనపు వైద్య సిబ్బందిని నియమించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.