schedule Saturday, July 04, 2026

పిల్లీ చోరీ వెరీ సిల్లీ..!

calendar_today January 10, 2023
person dharshininews
పిల్లీ చోరీ వెరీ సిల్లీ..!
పిల్లీ చోరీ వెరీ సిల్లీ..! - సంకలో పెట్టుకుని తుర్రుమన్న వ్యక్తి - సీసీ కెమెరాలో రికార్డు.. వీడియోపై లుక్కేయండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దొంగతనాలలో ఈ వింత దొంగతనం ఇది. హైదరాబాద్‌ నగరంలో జరిగిన దొంగతనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవరైనా చోరీలకు పాల్పడితే బంగారం, వెండి, డబ్బులు ఎత్తుకెళుతారు. కాని ఈ ఘనుడు సిల్లీగా పిల్లిని ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్‌లోని జహంగీర్ నగర్ కు చెందిన గజాన్ మహమూద్ అనే యువకుడు ఒడ్ ఐ క్యాట్ బ్రీడ్ కి చెందిన పిల్లిని థాయిలాండ్ నుండి రూ. 35 వేలు పెట్టి కొన్నాడు. దీనిని ఏడు నెలల క్రితం తన సమీప బంధువుల వద్ద కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పిల్లి విలువ సుమారు రూ.50 వేలు పైనే ఉంది. అయితే, సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి తన పెళ్లిని ఎత్తుకెళ్లాడని, దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో నమోదయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసాడు యువకుడు గజాన్. తన పెల్లిని తనకు సురక్షితంగా అప్పగించాలని పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చోరీకి గురైన పిల్లి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కింద వీడియో చూడండి [video width="1920" height="1080" mp4="https://dharshininews.com/wp-content/uploads/2023/01/whatsapp-video-2023-01-10-at-102635-am.mp4"][/video]