schedule Sunday, July 05, 2026

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

calendar_today January 10, 2023
person dharshininews
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం - లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆప్పూ(నయూం) ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, నేతలు వార్డు నెంబర్ 31కి చెందిన రాములమ్మకు రూ. 56 వేలు, వార్డు నెంబర్ 5కు చెందిన కైసర్ కు రూ.52 వేలు, వార్డు నెంబర్ 10కి చెందిన నర్సింలుకు రూ. 9,500లు, వార్డు నెంబర్ 23 కు చెందిన అమృతకు రూ.16 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు అండగా నిలిచిందన్నారు. ఈ పథకం పేదలకు వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు.