schedule Thursday, July 09, 2026

వాసవి క్లబ్ సేవా సైన్యం సిద్దం

calendar_today January 11, 2023
person dharshininews
వాసవి క్లబ్ సేవా సైన్యం సిద్దం
వాసవి క్లబ్ సేవా సైన్యం సిద్దం - జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రటరి రొంపల్లి సంతోష్ కుమార్ - తాండూరు కార్యవర్గ సభ్యుల ఎన్నిక తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవా రంగంలో ముందుండే వాసవి క్లబ్‌ తాండూరుశాఖ సేవా సైన్యంను సిద్దం చేయడం జరిగిందని వాసవి క్లబ్ జిల్లా కాబినెట్ జాయింట్ సెక్రటరి(డిస్ట్రిక్ 108 ఎ) రొంపల్లి సంతోష్‌ కుమార్ తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను తాండూరు శాఖ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. తాండూరు అధ్యక్షులుగా రెడ్డి శెట్టి సతీష్‌, ఉపాధ్యక్షులుగా బీచ వీరేష్‌, సెక్రటరీగా చల్లా గుణవర్దన్, జనరల్ సెక్రటరీగా మంకాల్‌ రఘురాం, కోశాధికారిగా చల్లా వినయ్, జోన్ చైర్మన్‌గా కేళిగారి ప్రవీణ్‌ కుమార్, డిస్ట్రిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా గుమడాల గౌరీ శంకర్‌లను నియమించడం జరుగుతుందని రొంపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అందరి సహాకారంతో సమాజ హితం కోసం విభిన్న సేవా కార్యక్రమాలను చేపట్టి వాసవి క్లబ్ ప్రతిష్ఠను పెంచడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.