schedule Sunday, July 05, 2026

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

calendar_today January 14, 2023
person dharshininews
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి - ఓబీసీ మోర్చ అధ్యక్షులుగా తిరుపతయ్య గౌడ్‌ - నియామకపత్రం అందజేసిన పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో తాండూరు పట్టణ ఓబిసి మోర్చ అధ్యక్షులుగా తిరుపతయ్య గౌడ్ ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్‌ తిరుపతయ్య గౌడ్‌కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ దేశ సమగ్రాభివృద్దికి బీజేపీ ఎంతో కృషి చేస్తుందన్నారు. బీజేపీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టి శ్రీనివాస్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, కార్యదర్శులు చందు, ప్రకాష్, రాష్ట్ర ఎస్టి మోర్చా స్పోర్ట్స్ కన్వీనర్ భాను పవార్, గిరిజన మోర్చా అధ్యక్షుడు నవీన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.