schedule Sunday, July 05, 2026

అంకిత భావంతో సమాజ సేవ

calendar_today July 5, 2026
person dharshininews
అంకిత భావంతో సమాజ సేవ
అంకిత భావంతో సమాజ సేవ - ఘనంగా లయన్స్‌ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం - అధ్యక్షులుగా మహమ్మద్ యూసుఫ్‌, కార్యదర్శిగా మల్లారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ సేవే ధ్యేయంగా లయన్స్‌ క్లబ్ పనిచేస్తుందని క్లబ్ ప్రముఖులు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్‌లో తాండూరు లయన్స్‌ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. 2026-27 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా మహమ్మద్ యూసుఫ్‌, ప్రధాన కార్యదర్శిగా పి.మల్లారెడ్డి, కోశాధికారిగా మహమ్మద్ బాసిత్ అలీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఎం. విద్యాసాగర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్ సమాజ సేవలో విశేష సేవలందిస్తోందని కొనియాడారు. నూతన కమిటీ కూడా అదే సేవా స్ఫూర్తితో ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధి, మానవతా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తామని, అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా విద్యారంగంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ప్రశంసించి, అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు వి. రామకృష్ణారెడ్డి, జోన్ చైర్మన్ ఎస్. ప్రదీప్ కుమార్ పాటిల్, జిల్లా గవర్నర్ రమేష్ చంద్ర పండిట్, ఓం ప్రకాష్ సోమాని, సల్లా దామోదర్, సయ్యద్ జుల్ఫికార్ అలీ, మాజీ అధ్యక్షుడు శరణబసప్ప, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ లయన్ నాయకులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/43689/