schedule Sunday, July 05, 2026

ఘనంగా రక్త మైసమ్మ జాతర ఉత్సవాలు

calendar_today January 22, 2023
person dharshininews
ఘనంగా రక్త మైసమ్మ జాతర ఉత్సవాలు
ఘనంగా రక్త మైసమ్మ జాతర ఉత్సవాలు - శోభాయమానంగా పల్లకి సేవ ఊరేగింపు - దర్శించుకున్న ఎమ్మెల్సీ తనయుడు రినీష్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం మర్రిచెట్టు కూడలిలో వెలసిన శ్రీ రక్తమైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. జాతర ఉత్సవాల సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించారు. పలు వీదుల్లో ఈ ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. అంతేకాకుండా జాతర ఉత్సవాల సందర్భంగా మహిళలు బోనాలతో ఆలయానికి తరలివచ్చారు. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనయుడు పట్నం రినీష్ రెడ్డి, నేతలు దర్శించుకుని పూజలు నిర్వహించారు. మరోవైపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన నేతలు, గంజ్ వ్యాపారులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతర ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్వ ఉమాశంకర్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రదీప్, రాజు, జగదీశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు భద్రు, రవి, సురేష్, వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.