schedule Tuesday, September 08, 2026

జిల్లాలో 2 నుంచి సదరం క్యాంపులు

calendar_today January 30, 2023
person dharshininews
జిల్లాలో 2 నుంచి సదరం క్యాంపులు
జిల్లాలో 2 నుంచి సదరం క్యాంపులు - రేపే స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం - ప్రకటించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: జిల్లాలో సదరం క్యాంపులు షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల ఫిబ్రవరి 2వ తేది నుంచి క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల అయ్యింది. జిల్లా గ్రామీణ అధికారి కృష్ణన్ ఈ ప్రకటన చేశారు. ఓహెచ్‌కు సంబంధించి మాత్రమే సదరం క్యాంపులు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి2వ తేదిన వికారాబాద్‌ సీహెచ్‌సీలో క్యాంపు ఉంటుందని తెలిపారు. 9వ తేదిన తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో క్యాంపు జరుగుతుందన్నారు. 16వ తేదిన వికారాబాద్‌ సీహెచ్‌సీలో, 23న తాండూరులోనిప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి క్యాంపులో 50 మంది చొప్పున పరీక్షలు నిర్వహించడం జరగుతుందని చెప్పారు. స్లాట్ బుకింగ్ కోసం రేపు 31వ తేదిన అవకాశం కల్పించడం జరిగిందన్నారు. సంబంధిత వికలాంగులు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.