schedule Tuesday, September 08, 2026

అర్దనారీశ్వరుడుగా శివుడు

calendar_today February 6, 2023
person dharshininews
అర్దనారీశ్వరుడుగా శివుడు
అర్దనారీశ్వరుడుగా శివుడు - భద్రేశ్వర దేవాలయంలో దర్శనం - అలంకరణ ప్రత్యేకత ఇదే తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో వెలసిన శివుడు భక్తులకు విభిన్న రూపాలలో దర్శనమిస్తారు. సోమవారం ఆలయంలో శివుడు అర్దనారీశ్వరుడుగా దర్శనమిచ్చారు. ఈరోజు ఎందుకంటే మాఘ సోమవారం సందర్భంగా ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి శివున్ని అర్దనారీశ్వరుడుగా అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చిన భక్తులు అర్థనారీశ్వర స్వామి అలంకరణలో దర్శన మిచ్చిన శివున్ని దర్శించుకున్నారు.