schedule Tuesday, September 08, 2026

జోరుగా పారిశుద్ధ్య పనులు

calendar_today February 7, 2023
person dharshininews
జోరుగా పారిశుద్ధ్య పనులు
జోరుగా పారిశుద్ధ్య పనులు - హైదరాబాద్ రోడ్డు కార్మికుల శ్రమాధానం - దగ్గరుండి చేయించిన శానిటరీ ఇనుస్పెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పారిశుద్ధ్య పనులు జోరుగా చేపట్టారు. మంగళవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ముమ్మరంగా చేపట్టారు. మున్సిపల్ శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్  కుమార్ దగ్గరుండి పనులు చేయించారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న డివైడర్ పై ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త చేదారం తొలగించారు. దీంతో డివైడర్ అందంగా మారింది. ఈ సందర్బంగా శానిటరీ ఇనుస్పెక్టర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యంకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జావాన్లు, కార్మికులు పాల్గొన్నారు.