schedule Saturday, September 19, 2026

ఏకగ్రీవం మాకోద్దు..!

calendar_today February 12, 2023
person dharshininews
ఏకగ్రీవం మాకోద్దు..!
ఏకగ్రీవం మాకోద్దు..! - ఎన్నికలు జరగాల్సిందే - సహకరించాలని డీఎస్పీకి వినతి - తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో ఎన్నికల గోల తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో ఎన్నికల గోల కొనసాగుతోంది. అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఏకగ్రీవం చేయాలనే ప్రయత్నాలను సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. గత యేడాది డిసెంబర్‌ నుంచి అసోసియేషన్‌లో ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసోసియేషన్ సీనియర్ సభ్యులు ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. అయితే అసోసియేషన్‌లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే వ్యతిరేకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయినా కూడ సీనీయర్ సభ్యులు ఏకగ్రీవానికి మొగ్గు చూపడంతో అందరు ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. ఇందులో భాగంగా అసోసియేషన్‌ సభ్యులు తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్‌ను కలిశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించేలా చూడాలని సభ్యులు డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్‌లో ఎన్నికలను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వైన్‌ సైడ్ ఎన్నికలు మాకు అవసరం లేదని అన్నారు. ఏకగ్రీవం జరిగితే ఇబ్బందులు వస్తాయని సభ్యులు డీఎస్పీకి వివరించారు. ఇందుకు డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ అసోసియేషన్‌ సభ్యులతో చర్చించి ఎన్నికలపై సానుకూల నిర్ణయం తీసుకుందామని సూచించారు. తేది నిర్వహించాకే ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపారు. ఇందుకు అసోసియేషన్‌ సభ్యులు అంగీకరించారు.