schedule Friday, September 18, 2026

తాండూరులో లడ్డూ వేలం శుభారంభం..!

calendar_today September 18, 2026
person dharshininews
తాండూరులో లడ్డూ వేలం శుభారంభం..!
తాండూరులో లడ్డూ వేలం శుభారంభం..! - రూ. 1లక్ష 1000కి భద్రేశ్వర లడ్డూ వేలం - భక్తునికి అందజేసిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలో లడ్డూ వేలం సందడి మొదలైంది. శ్రీ భావిగి భద్రేశ్వర వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. భక్తులు పోటీపడి వేలంలో పాల్గొనగా లడ్డూకు రూ.1 లక్ష 1000లు ధర పలికింది. తాండూరు మార్వాడి బజార్‌కు చెందిన సంజయ్‌ సర్డా(గోపాల్‌ సర్డా కుమారుడు) వేలంలో పాల్గొని రూ.1,01,000కు భద్రేశ్వర గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూను సంజయ్‌ సర్డాకు అందజేసి అభినందించారు. వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకుంటే గణనాథుడి ఆశీస్సులతో కుటుంబానికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ప్రతి ఏటా లడ్డూ వేలానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈసారి కూడా భక్తుల సమక్షంలో ఉత్సాహంగా సాగిన వేలంలో రూ.1,01,000కు లడ్డూ కైవసం కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. https://www.dharshininews.com/44763/