schedule Thursday, September 17, 2026

శాస్త్ర స్కూల్‌లో విద్యార్థి పాలనకు శ్రీకారం..!

calendar_today September 17, 2026
person dharshininews
శాస్త్ర స్కూల్‌లో విద్యార్థి పాలనకు శ్రీకారం..!
శాస్త్ర స్కూల్‌లో విద్యార్థి పాలనకు శ్రీకారం..! - ఘనంగా విద్యార్థి మండలి ఎన్నికలు - నూతన నాయకులతో ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణతో పాటు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే ఉద్దేశంతో శాస్త్ర స్కూల్‌లో గురువారం విద్యార్థి మండలి ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ నాయకులను ఎన్నుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం తరఫున షూస్‌, బ్యాడ్జ్‌లు అందజేసి అభినందించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రమాణం చేశారు.  కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్‌లు పాల్గొని నూతన విద్యార్థి నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ బాధ్యతలను స్వీకరించడం వల్ల భవిష్యత్తులో సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు. నాయకత్వం అంటే కేవలం పదవి కాదని, బాధ్యతతో వ్యవహరించడం ముఖ్యమని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగుతూ, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పాఠశాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44751/