నిమజ్జనంలో డీజేలు, బాణాసంచాకు బ్రేక్..!
September 17, 2026
dharshininews
నిమజ్జనంలో డీజేలు, బాణాసంచాకు బ్రేక్..!
- ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలి
- తాండూరులో పర్యటించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ సూచించారు.
నిమజ్జన రూట్‌మ్యాప్, కాగ్నా నది, భూకైలాష్, మల్‌రెడ్డిపల్లి చెరువు వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. శోభాయాత్రలో డీజేలు, బాణాసంచా వినియోగానికి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. మద్యం, గంజాయి సేవించి ఉత్సవాల్లో పాల్గొనవద్దని సూచించారు.
పోలీసుల సూచించిన మార్గంలోనే శోభాయాత్ర కొనసాగించాలని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాలంటీర్లు పోలీసులకు సహకరించాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో 8712670056కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ యాదయ్య, టౌన్ సీఐ పరమేశ్వర్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44755/