schedule Friday, September 18, 2026

తాండూరులో నేడు గణేశ్‌ నిమజ్జన మహోత్సవం!

calendar_today September 18, 2026
person dharshininews
తాండూరులో నేడు గణేశ్‌ నిమజ్జన మహోత్సవం!
తాండూరులో నేడు గణేశ్‌ నిమజ్జన మహోత్సవం! - మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం - కోకట్‌ కాగ్నా నది, మల్‌రెడ్డిపల్లి చెరువులో నిమజ్జనాలు - భారీ గణపతుల కోసం ప్రత్యేక క్రేన్లు - పోలీసుల పటిష్ఠ బందోబస్తు తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి ఉత్సవాలకు ముగింపు పలుకుతూ తాండూరు పట్టణంలో శుక్రవారం గణేశ్‌ నిమజ్జనోత్సవం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది. సుమారు 285 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే గణపతులను కోకట్‌ కాగ్నా నది, మల్‌రెడ్డిపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన కేంద్రాల్లో నిమజ్జనం చేయనున్నారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా క్రేన్‌ సదుపాయాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా జిల్లా అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా, తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు. నిమజ్జనోత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీసు శాఖకు సహకరించాలని హిందూ ఉత్సవ కేంద్ర సమితి విజ్ఞప్తి చేసింది. అత్యవసర పరిస్థితులు, సమస్యలు ఎదురైతే పోలీసు శాఖ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌ 8712670056కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. https://www.dharshininews.com/44758/