వినాయక నిమజ్జనం ప్రశాంతం..!
September 19, 2026
dharshininews
వినాయక నిమజ్జనం ప్రశాంతం..!
- ఫలించిన పోలీసుల వ్యూహం
- సహకరించిన అందరికి కృతజ్ఞతలు
- తాండూరు హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కనివిని ఎరుగని రీతిలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందుకు సహకరించిన వారందరికి హిందూ ఉత్సవ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు వినాయకున్ని పూజించి శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. ఇందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నిమజ్జనానికి వినాయకులను యాలాల మండలం కోకట్ కాగ్నానదికి తరలించేందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున విశేష కృషి చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగక పోవడంతో పోలీసుల వ్యూహం ఫలించింది. వినాయక నిమజ్జనం ప్రశాతంగా జరుపుకునేందుకు సహకరించడంపై హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తరుపున ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు వినాయక ఉత్సవ సమితి సభ్యులకు, పట్టణ ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా నిమజ్జనం ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐలు పరమేశ్వర్ గౌడ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
https://www.dharshininews.com/44781/