schedule Friday, September 18, 2026

ఎమ్మెల్యేకు 'గణ'మైన కానుక..!

calendar_today September 18, 2026
person dharshininews
ఎమ్మెల్యేకు 'గణ'మైన కానుక..!
ఎమ్మెల్యేకు 'గణ'మైన కానుక..! - మనోహర్ రెడ్డికి గణేష్‌ లడ్డు అందజేత - భక్తి.. అభిమానం చాటుకున్న పటేల్ కిరణ్‌ కుమార్ - రూ. 75వేలకు శాంతినగర్‌ లడ్డు సొంతం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ వినాయక చవితి కానుకను అందించారు. ఐదు రోజుల పాటు వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డూ ప్రసాదాన్ని తన చేతుల మీదుగా ఎమ్మెల్యేకు సమర్పించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాంతినగర్‌లో ప్రతిష్టించిన గణేషుని లడ్డుకు శుక్రవారం వేలం నిర్వహించారు. లడ్డూ వేలం పాటలో భద్రేశ్వర దేవాలయ మాజీ రేవనేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ రూ.75 వేల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. అనంతరం ఆ లడ్డూను తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి స్వయంగా అందజేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభిమానిగా పటేల్ కిరణ్‌ కుమార్ వేలంలో దక్కించుకున్న లడ్డును ఆయనకు అందించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతోనే భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్‌గా అవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు. నమ్మిన వారి కోసం, తాండూరు ప్రజల కోసం నిరంతర కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రానున్న రోజుల్లో అన్నీ శుభాలే జరగాలని పటేల్ కిరణ్‌ కుమార్ ఆకాంక్షించారు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. https://www.dharshininews.com/44775/