మంటలు రేపిన ఇంటి దీపం..!
September 18, 2026
dharshininews
మంటలు రేపిన ఇంటి దీపం..!
- అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్దం
- మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
- పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో దేవుని వద్ద వెలిగించిన దీపం అదే ఇంటికి మంటలు అంటుకునేందుకు కారణమైంది. దీపంపై బట్టలు పడడంతో అగ్ని ప్రమాదం సంబవించింది.
ఈ సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. తాండూరు పట్టణంలోని 20వ వార్డు గాంధీనగర్‌లో హిందూబాయి అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే శుక్రవారం ఇంట్లో దేవుని వద్ద దీపం వెలిగించింది. కొద్ది సేపటికి దీపంపై బట్టలు పడడంతో ప్రమాద వశాత్తు మంటలు చెలరేగాయి.
అగ్ని ప్రమాదంలో సంబవించిన మంటల పొగతో ఇంట్లో ఉన్న హిందూబాయి అస్వస్థతకు గురైంది. అక్కడే ఉన్న కౌన్సిలర్ భర్త సంతోష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తాండూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రమాదం జరిగిన నివాసంకు చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. బాధపడోద్దు.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మరోవైపు జరిగిన ప్రమాదంపై తాండూరు ఫైర్ ఆఫీసర్ సుశీల్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ. 30వేలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. ఫైర్ సిబ్బంది సరైన సమయంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
https://www.dharshininews.com/44771/