schedule Saturday, September 19, 2026

న్యాయం జరిగేలా చూస్తాం

calendar_today February 16, 2023
person dharshininews
న్యాయం జరిగేలా చూస్తాం
న్యాయం జరిగేలా చూస్తాం - శివస్వాముల కుటుంబాలకు బండి సంజయ్ భరోసా - కుటుంబ సభ్యులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో రిమాండుకు వెళ్లిన శివ స్వాముల కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. గురువారం జిల్లాలోని పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేటలో జరిగిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. అక్కడే బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌ కుమార్ సమక్షంలో శివస్వాముల కుటుంబ సభ్యులు బండి సంజయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ యాలాల మండలం దేవనూర్ శివస్వాముల ఘటన గురించి ఆరా తీశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎవ్వరు ఆధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. శివ స్వాముల ఘటనలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విష్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, యాలాల మండల అధ్యక్షుడు మహిపాల్ తదితరులున్నారు.