schedule Tuesday, September 08, 2026

జై శ్రీరామ్.. జై హనుమాన్..!

calendar_today February 25, 2023
person dharshininews
జై శ్రీరామ్.. జై హనుమాన్..!
జై శ్రీరామ్.. జై హనుమాన్..! - వైభవంగా హనుమాన్ మండల దీక్షా దారణ - మార్మోగిన నామ స్మరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : జై శ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణతో తాండూరు పట్టణంలోని కన్యా పాఠశాల హనుమాన్ దేవాలయం మర్మోగింది. శనివారం దేవాలయంలో ఆధ్వర్యంలో పలువురు యువకులు హనుమాన్ మండల దీక్షాధారణ గావించారు. వేద పండితులు, గురు స్వామి జై శ్రీరామ్ అశోక్, సమితి సభ్యులు వినోద్ గురుస్వామి సమక్షంలో 8 మంది యువకులు మాల ధరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దీక్ష చేపట్టిన భక్తులు నియమాలు పాటించాలన్నారు. నిత్యం హనుమాన్ స్మరణ చేస్తూ భక్తి భావ చింతన కలిగి ఉండాలన్నారు. స్వామి స్మరణతో దైవ ప్రాప్తి కలుగుతుంది అని అన్నారు. అదేవిదంగా దీక్షా సమితి ఆధ్వర్యంలో 16న హనుమాన్ అర్ధ మండల దీక్ష ప్రారంభం అవుతుందన్నారు. భక్తులు మాల దారణ చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు నరేష్, చంద్రకాంత్, శ్రీనివాస్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.