schedule Tuesday, September 08, 2026

మాంసం వ్యాపారులకు ఝలక్..!

calendar_today February 27, 2023
person dharshininews
మాంసం వ్యాపారులకు ఝలక్..!
మాంసం వ్యాపారులకు ఝలక్..! - చికెన్, మటన్‌ వ్యర్థాలు పారవేస్తే చర్యలు - హోటల్స్‌, రెస్టారెంట్లకు మున్సిపల్ నోటీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మాంసం వ్యాపారులు, రెస్టారంట్ నిర్వహకులకు మున్సిపల్ అధికారులు ఝలక్‌ ఇచ్చారు. పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మాంసం వ్యర్థాల పారబోతపై నిషేధం విధించడం జరిగిందని తెలిపారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాంసం వ్యర్థాలు పారవేస్తే చర్యలు తప్పవని తాండూరు మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఈ వేసవిలో మాంసం వ్యర్థాలకు అలవాటు పడిన వీధి కుక్కుల నియంత్రణలో భాగంగా మున్సిపల్ అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ సూచనలతో సోమవారం అధికారులు, సిబ్బంది పట్టణంలోని మటన్, చికెన్ వ్యాపారస్తులతో పాటు పలు ఫంక్షన్‌ హాల్స్‌, హోటల్స్‌, పలు రెస్టారెంట్లకు నోటీసులు అందజేశారు. వ్యాపారులు మాంసం వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో, మురుగు కాలువల్లో పారవేయడం నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి పారవేస్తే ఎస్టబ్ల్యూఎం-2016 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మాంసం వ్యర్థాలను మున్సిపల్ నుంచి వచ్చే మేరిస్ ఫుడ్స్ అండ్ ఫుడ్స్ వాహనాలకు అందించాలని సూచించారు.