గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పోరు
March 2, 2023
dharshininews
గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పోరు
- రేపు తాండూరులో దర్నాలు
- ప్రకటించిన వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుకు సిద్దమైంది. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రేపు తాండూరు నియోజకవర్గంం, మండలం, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరులో దర్నాలు చేపడుతున్నట్లు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 చొప్పున పెంచిందని పార్టీ నేతలు మండిపడ్డారు. సిలిండర్ ధరల పెంపు ప్రజల నడ్డి విరిస్తున్నదని, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. ధరలు పెరగడంతో ప్రజల కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా రేపు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపడుతన్నట్లు, ఈ దర్నాలలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.