schedule Tuesday, September 08, 2026

6న కామదహనం, 7న హోలీ

calendar_today March 2, 2023
person dharshininews
6న కామదహనం, 7న హోలీ
6న కామదహనం, 7న హోలీ - పండగపై హిందూ ఉత్సవ సమితి క్లారిటీ - పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి: ఈ నెల 6న కామదహనం, 7వ తేదినే హోలీ పండగను జరుపుకోవాలని తాండూరు హిందూ ఉత్సవ సమితి సభ్యులు సూచించారు. పండగకు ముందు కామదహనం, హోలీ వేడుకలపై ప్రజల్లో అస్పష్టత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు సిద్ధలింగయ్య స్వామి పంచాంగ శ్రవణం ద్వారా హోలీ పండగ నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిద్ధలింగయ్య స్వామి మాట్లాడుతూ వచ్చే సోమవారం పౌర్ణమి గడియలు రాత్రి అంతా ఉంటాయని, కావున హిందూ బంధువులు సోమవారం అర్ధరాత్రి కామ దహన పౌర్ణమిని జరుపుకోవాలన్నారు. మరుసటి రోజు హోలీ సంబరాలు జరుపుకో వచ్చని తెలిపారు. అనంతరం పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ పంచాంగం, హిందూ సంప్రదాయం ప్రకారం హింధువులు, హిందూ బంధువులు అందరు ఈనెల 6న కామదహనం, 7న హోలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పూజారీ పాండు ఉన్నారు. పంచాంగం వినండి... [video width="640" height="352" mp4="https://dharshininews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Video-2023-03-02-at-18.32.20.mp4"][/video]