schedule Saturday, September 19, 2026

కలెక్టర్‌ను కలిసిన కార్మికులు

calendar_today March 3, 2023
person dharshininews
కలెక్టర్‌ను కలిసిన కార్మికులు
కలెక్టర్‌ను కలిసిన కార్మికులు - పీఆర్సీ వేతనాల అములపై మొర - సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని తాండూరు మున్సిపల్ కార్మికులు కలిశారు. శుక్రవారం కలెక్టర్‌ను కలిసి పీఆర్సీ వేతనాల అమలుపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో పీఆర్సీ జీవో అమలు అవుతున్న నాటి నుంచి వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు కలెక్టర్‌కు వివరించారు. ఈ విషయంపై వినతిపత్రాలు, దర్నాలు, నిరహార దీక్షలు కూడ చేయడం జరిగిందని తెలిపారు. కాని సమస్య పరిష్కారం కావడంలేదని కలెక్టర్ ముందు మొరపెట్టుకున్నారు. వేతనాలు అందక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదేవిధంగా 18 మంది కార్మికులకు వేతనాలు అందని విషయాన్ని కూడ కలెక్టర్‌కు వివరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గోపాల్, తాండూరు మున్సిపల్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వీరేశం, సెక్రెటరీ భూపతి, జిల్లా కార్మిక నాయకులు అశోక్, గోపాల్, విజయలక్ష్మి, హుసేన్, వెంకటప్ప, మైలారం వెంకటప్ప, మొగులమ్మ, దేవమ్మ, పరిగి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.