schedule Saturday, July 04, 2026

ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల

calendar_today March 7, 2023
person dharshininews
ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల
ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల - తప్పులుంటే సరిచేసుకునే అవకాశం - ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఇంట‌ర్ బోర్డు విద్యార్థుల హాల్‌ టిక్కెట్లను విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లను అప్‌లోడ్ చేసిన‌ట్లు బోర్డు అధికారులు తెలిపారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లను అప్‌లోడ్ చేసిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని, హాల్ టికెట్‌లో ఫోటో, సంతకం, పేరు, సబ్జెక్ట్ తదితర విషయాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్, లేదా బోర్డుకు తెలియజేసే అవకాశం కల్పించడం జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. హాల్ టికెట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. ముందుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/‌ను సంద‌ర్శించిన తరువాత TSBIE IPE 2023 Inter Hall Tickets లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత https://tsbieht.cgg.gov.in/IPE2023FirstYrHallTickets.do లింక్ ఓపెన్ అవుతుంది. (లింక్ ఇంకా యాక్టివేట్ కాలేదు.) అక్కడ వివరాలను న‌మోదు చేసి స‌బ్మిట్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, కాలేజీ పేరు, స‌బ్జెక్టుల వివ‌రాలు స‌రిగా ఉన్నాయో లేదా అని చూసుకోవాలి. పరిశీలించిన తరువాత హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే.. అక్ష‌ర దోషాలు ఉంటే కాలేజీ ప్రిన్సిపాల్ లేదా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలి.