schedule Tuesday, September 08, 2026

సదరం క్యాంపుల షెడ్యూల్ విడుదల

calendar_today March 8, 2023
person dharshininews
సదరం క్యాంపుల షెడ్యూల్ విడుదల
సదరం క్యాంపుల షెడ్యూల్ విడుదల - మార్చి 16 నుంచి క్యాంపులు - ఈసారి స్లాట్‌లు ఎన్ని అంటే తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో సదరం క్యాంపుల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది. మార్చి నెలలో నిర్వహించే క్యాంపుల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈనెల 16 నుంచి 31వ తేది వరకు తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, వికారాబాద్‌ సీహెచ్‌సీ ఆసుపత్రులలో నిర్వహించే క్యాంపు తేదిలు వెల్లడించారు. ఈనెల 16, 23వ తేదిలలో తాండూరు ప్రభుత్వ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అన్ని మండలాలకు సంబంధించి శారీరక వికలాంగత్వం ఉన్న వారికి సదరం, 27న మానసిక బుద్ది మాంధ్యం వికలాంగులకు, 31వ తేదిన చెవుడు, మూగ వికలాంగులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 29న వికారాబాద్‌ సీహెచ్‌సీ ఆసుపత్రిలో అంధత్వలోపం ఉన్న వికలాంగులకు సదరం పరీక్షలు ఉంటాయని తెలిపారు. మొత్తం 6 క్యాంపుల ద్వారా 390 స్లాట్లు కేటాయించడం జరిగిందని తాండూరు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ తెలిపారు. ఈ క్యాంపులను అర్హులైన వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.