schedule Saturday, September 19, 2026

పదిపై స్పెషల్ ఫోకస్..!

calendar_today March 9, 2023
person dharshininews
పదిపై స్పెషల్ ఫోకస్..!
పదిపై స్పెషల్ ఫోకస్..! - మెరుగైన ఫలితాల సాధనకు కృషి - పరీక్షలకు 70 సెంటర్లు ఏర్పాటు - హాజరుకానున్న 13324 మంది విద్యార్థులు - జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి అన్నారు. గురువారం తాండూరు పట్టణం గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల తనిఖీకి వచ్చిన డీఈఓ రేణుకా దేవి విలేకరులతో మాట్లాడారు. ఈ సారి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే అభ్యాస దీపికలు అందజేయడం జరిగిందని, ప్రత్యేక తరగతులు కూడ నిర్వహిస్తున్నాచున్నారు. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పహారం కోసం రూ. 42 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈనెల 15 నుంచి విద్యార్థులకు ఫ్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. ఈ పరీక్షల్లో ఒక రోజు పరీక్ష, మరోకరోజు విశ్లేషణతో పాటు చర్చ జరిపడం జరుగుతుందన్నారు. ఈ సారి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో పది పరీక్షల కోసం 70 సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు 13324 మంది హాజరవుతుండగా ఇందులో 8500 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి మిగతావారు ప్రైవేటు, ఇతర విద్యాసంస్థల ద్వారా పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్, కౌన్సిలర్ సంగీత ఠాకూర్, ఉపాధ్యాయులు ఉన్నారు.