schedule Saturday, September 19, 2026

పక్కాగా ఆఫీసుల ఆస్తిపన్నులు

calendar_today March 11, 2023
person dharshininews
పక్కాగా ఆఫీసుల ఆస్తిపన్నులు
పక్కాగా ఆఫీసుల ఆస్తిపన్నులు - ఒకే రోజు రూ. 1లక్ష 15వేలు వసూలు - వందశాతం పన్నులు చెల్లించాలి - మున్సిపల్ అధికారుల ఆదేశాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పట్టణంలోని సామాన్యుల నివాసాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడ ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. చాలా కాలంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆస్తిపన్నుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తిపన్నుల వసూళ్లు పకడ్బందీగా చేపడుతున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఐబీ బంగ్లా(ఇనుస్పెక్షన్‌ భవనం), ఇరిగేషన్ కార్యాలయాల నుంచి పన్నులు వసూలు చేశారు. ఈ రెండు కార్యాలయాలకు సంబంధించి రూ. 1లక్ష 15 వేల 40లను కట్టించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారులు, అధికారులు వంద శాతం ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని సూచించారు. లేదంటే మున్సిపల్ శాఖ పరమైన చర్యలు తప్పవని అన్నారు. పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిల్‌ కలెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.