schedule Tuesday, September 08, 2026

కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

calendar_today March 12, 2023
person dharshininews
కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత - ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు - హెల్త్ బులిటన్‌ విడుదల చేసిన వైద్యులు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రగతిభవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ను వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకవెళ్లారు. అక్కడ వైద్యులు సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు సీఎం కేసీఆర్ హెల్‌ బులిటన్‌ను విడుదల చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌కు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. కడుపునొప్పితో సీఎం ఆసుపత్రికి వచ్చారు. ఎండోస్కోపి, సిటీ స్కాన్‌ చేశాం. కేసీఆర్‌ కడుపులో చిన్న అల్సర్‌ ఉన్నట్టు గుర్తించాం. సీఎంకు మిగతా వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఈ సంఘటనతో బీఆర్ఎస్ నేతలు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కేసీఆర్ వెంట సతీమణి శోభ, ఎంపీ సంతోష్‌ కుమార్ తదితరులు ఉన్నారు.