మున్సిపల్‌లో ప్రజావాణి యథాతదం
March 12, 2023
dharshininews
మున్సిపల్‌లో ప్రజావాణి యథాతదం
- రేపు పట్టణవాసుల ఫిర్యాదుల స్వీకరణ
- సద్వినియోగం చేసుకోవాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రేపు ప్రజావాణి కార్యక్రమం యథాతధంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10-30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు ప్రజావాణి జరుగుతుందని వెల్లడించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, అసరా ఫించన్లు, టౌన్ ప్లానింగ్, బర్త్ అండ్ డెర్త్ సర్టిఫికెట్లపై ఫిర్యాదు చేసుకోవచ్చని, సీసీ రోడ్లు నిర్మాణం, మురుగుకాలువల నిర్మాణం, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సమస్యలు స్వీకరించడం జరగడం జరగదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.