schedule Sunday, July 05, 2026

తెలుగు జాతికి గర్వకారణం కవయిత్రి మొల్ల

calendar_today March 13, 2023
person dharshininews
తెలుగు జాతికి గర్వకారణం కవయిత్రి మొల్ల
తెలుగు జాతికి గర్వకారణం కవయిత్రి మొల్ల - మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు - శిశుమందిర్‌ పాఠశాలలో మొల్ల జయంతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు తొలి కవయిత్రి మొల్ల తెలుగు జాతికి గర్వకారణమని, మహిళ లోకానికి ఆదర్శమూర్తి అని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. సోమవారం తాండూరు పట్టణం శిశు మందిర్ పాఠశాలలో కవయిత్రి మొల్ల కళావేదిక ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు హాజరై కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని కవయిత్రి మొల్ల ఆరు కాండాలలో, 138 పద్యాలతో రాశారని అన్నారు. తొలి తెలుగు మహిళ కవయిత్రిగా మొల్ల ఆదర్శనీయమన్నారు. తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల కళావేదిక వ్యవస్థాపకులు కేవీఎం వెంకట్, శిశు మందిర్ పాఠశాల కార్యదర్శి ప్రభుశంకర్, కవి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ, ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.